కథ, కథనం, డైలాగ్స్, టేకింగ్.. త్రివిక్రమ్ సినిమాల్లో ఇవన్నీ ఒకెత్తయితే.. క్యారెక్టరైజేషన్స్ మరొకెత్తు. హీరోతో పాటు సినిమాలో ప్రతి పాత్రనీ ప్రత్యేకంగా తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్. ముఖ్యంగా హీరోకి దీటుగా ఒక పాత్రను సృష్టిస్తాడు. అది చాలావరకు లేడీ క్యారెక్టరే కావడం విశేషం.
అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో మూవీలో టబు పాత్రలే అందుకు ఉదాహరణ. తన నెక్స్ట్ సినిమాకి కూడా అలాంటి ఓ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. దానికి తగిన నటి కోసం మొదలుపెట్టిన అతని వేట.. ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. తనెవరో కాదు.. శోభన.
త్రివిక్రమ్ సినిమా మహేష్‌బాబుతో అనే సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్. హీరో హీరోయిన్లిద్దరి తర్వాత ఆ రేంజ్‌లో ఉండే ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం శోభనను సంప్రదించాడట మాటల మాంత్రికుడు. ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది శోభన. స్టార్ హీరోలందరితోనూ నటించింది.
ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి డ్యాన్స్‌పైనే దృష్టి పెట్టింది. ఎప్పడైనా ఓ స్పెషల్ క్యారెక్టర్ దొరికితే చేస్తోంది. రీసెంట్‌గా దుల్కర్ హీరోగా తెరకెక్కిన ‘పరిణయం’లో నటించింది. అయితే తెలుగులో నటించి మాత్రం చాలా కాలమే అయ్యింది. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో చెల్లెలి పాత్ర విషయంలో తన పేరు వినిపించింది కానీ ఆ చాన్స్ నయన్‌కి దక్కింది. మరి ఈ వార్తయినా నిజమైతే పదహారేళ్ల తర్వాత శోభన స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
This post was last modified on February 21, 2022 10:12 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…