రష్మిక మందన్నా.. అంటే తెలియని వారు ఉండరు. కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నాగ శౌర్య హీరోగా 2018 లో వచ్చిన `ఛలో` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో..రష్మికకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. అనతి కాలంలోనే స్టార్ హోదా ను దక్కించుకుంది.
అలాగే మరోవైపు తన క్యూట్‌నెస్‌తో నేషనల్ క్రష్‌గా కూడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములాను బాగానే ఫాలో అవుతోందట. వాస్తవానికి సినిమా రంగంలో హీరోయిన్ల కెరీర్ ఎల్లకాలం సక్సెస్ ఫుల్‌గా సాగుతుందనే గ్యారంటీ లేదు.
అందుకే రష్మిక తనకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ భారీగా ఆస్తులను వెనకేసుకుంటోందట. ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న ఈ భామ.. ఇండస్ట్రీలోకి వచ్చిన గత నాలుగేళ్లలోనే సినిమాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా ఏకంగా రూ. 37 కోట్లను సంపాదించిందట. అలాగే ఈమె పేరు మీద రెండు ఖరీదైన ఫ్లాట్స్ కూడా ఉన్నాయట. ఏదేమైనా పాతికేళ్ల వయసులోనే రష్మిక ఈ రేంజ్‌లో సంపాదిస్తుండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే రష్మిక `ఆడవాళ్లు మీకు జోహార్లు` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్‌తో `పుష్ప ది రూల్`లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేస్తోంది. ఈ హిందీ చిత్రాలు రెండూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
This post was last modified on February 21, 2022 1:30 pm
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్‌లో సినిమాలు తీశారు.…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…