బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోయిన్‌తో లావ్ ట్రాక్ నడిపించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే రియల్‌గా కాదండోయ్.. రీల్‌గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న రామ్.. ఇటీవల తన 20వ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మింబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీలో రామ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను తీసుకోబోతున్నారనే మ్యాటర్ తాజాగా లీకైంది.
ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్పాను సంప్రదించారని.. ఆమెకు కథ నచ్చడంలో పాజిటివ్‌గా స్పందించిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రామ్‌కు పరిణితికి మధ్య అదిరిపోయే లవ్ ట్రాక్‌ను బోయపాటి డిజైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
కాగా, రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. అలాగే ఇందులో రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on February 21, 2022 11:21 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…