మహానటి – బయోపిక్‌లు ఎలా తీయాలి? అనే ప్రశ్నకు తెరెత్తు సమాధానంగా నిలిచింది మహానటి
. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మనసు పెట్టి పనిచేశాయి. అందుకే… సావిత్రమ్మకి మళ్లీ ప్రాణం పోసి, తన కథని కళ్లకు కట్టినట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి దక్కింది. మహానటి
తరవాత మళ్లీ బయోపిక్‌లు తీయనని దర్శకుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్కటి చాలు కదా..?
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మహానటి
తో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్‌కి… ఆ తరవాత బయోపిక్ అవకాశాలు వరుస కట్టాయి. చాలా కథలు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒకట్రెండు బయోపిక్ ప్రాజెక్టులు ఆమె దగ్గర ఉన్నాయని టాలీవుడ్ టాక్. కానీ… అవేం నిజం కాదని తేల్చేసింది కీర్తి.
”నా జీవితంలో ఒకే ఒక్క బయోపిక్ ఉంది. అదే.. మహానటి. అలాంటి సినిమా జీవితానికి ఒక్కటి చాలు కదా. ఇకముందు బయోపిక్‌లు చేయను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్రస్తుతం నితిన్‌తో రంగ్‌దే చేస్తోంది. తాను నటించిన ‘పెంగ్విన్’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అది తన ఖాతాలో వేసుకుంటే… మరో గోల్డెన్ ఛాన్స్‌కొట్టేసినట్టే.
This post was last modified on June 16, 2020 3:53 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…