సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఆరంభంలోనే వరుస ఫ్లాపులను ఖాతాలో వేసుకుని ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర వల్ల కొందరి హీరోయిన్ల కెరీర్ సైతం క్లోజ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ ఐరన్ లెగ్ అనే ముద్ర తనపై పడి కెరీర్ ఎక్కడ నాశమవుతుందో అని కుర్ర హీరోయిన్ కేతిక శర్మకు కొత్త టెన్షన్ పట్టుకుందట. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. కానీ, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన `లక్ష్య` మూవీతో కేతిక శర్మ ప్రేక్షకులను పలకరించింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ప్రస్తుతం కేతిక శర్మ ఆశలన్నీ `రంగ రంగ వైభవంగా` సినిమాపైనే పెట్టుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతిక హీరోయిన్‌గా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా హిట్ అయితే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కేతిర శర్మ ఎంతగానో ఆశ పడుతోంది. అయితే ఒకవేళ సినిమా రిజల్ట్‌లో ఏదైనా తేడా వస్తే.. కేతికపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడటం ఖాయమని అంటున్నారు సినీ ప్రియులు.
This post was last modified on February 20, 2022 8:02 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…