`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఫస్ట్ మూవీతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశాడు కానీ.. `ఆర్ఎక్స్ 100` స్థాయి హిట్టు మాత్రం పడలేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వలిమై`లో కార్తికేయ విలన్‌గా చేశాడు.
ఇదే ఆయనకు తొలి తమిళ చిత్రం. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో సీబీసీఐడీ ఆఫీసర్‌గా అజిత్ నటించగా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరిగే కిలాడిగా కార్తికేయ కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 24న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అలాగే విలన్‌గా నటిస్తే ఎలాంటి బెనిఫిట్స్‌ను పొందొచ్చో కూడా వివరించారు. కార్తికేయ మాట్లాడుతూ.. `హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్‌కు హద్దులు ఉండవు.
విలన్ రోల్స్‌ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్, మూవీ అవుట్‌పుట్, మార్కెట్ ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అదే విలన్‌కి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు` అంటూ సరదగా చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, భారీ అంచనాలు ఉన్న వలిమై చిత్రం మంచి విజయం సాధిస్తే తమిళంలో కార్తికేయకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు.
This post was last modified on February 20, 2022 10:58 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…