జగపతిబాబు అంటే జాలీ టైప్ అన్నట్లు కనిపిస్తారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విషయాల ప్రస్తావన వస్తే తన క్యాజినో సరదాల గురించి.. స్నేహితులతో పార్టీల గురించే మాట్లాడుతుంటారాయన. ఫ్యామిలీ యాంగిల్ ఎప్పుడూ అంతగా బయటికి తీయరు. తన భార్యా పిల్లల గురించి పెద్దగా మాట్లాడరు. వ్యక్తిగత విషయాల గురించి చర్చించడం ఇష్టం లేనట్లే కనిపిస్తారు. ఐతే తన 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని జగపతిబాబు తన కుటుంబం గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు.
తన షష్ఠి పూర్తిని తన కుటుంబ సభ్యులు చాలా గొప్పగా ప్లాన్ చేసి చేశారని.. వాళ్ల ప్రేమ తనను కదిలించిందని జగపతి వెల్లడించారు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో తాను నటించిన అన్ని సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సేకరించి.. వాటిని ఒక గదిలో అందంగా అలంకరించి తన కోసం ప్రత్యేక బహుమతిని సిద్ధం చేయడంతో జగపతి ఎమోషనల్ అయ్యారు.
ఆ గదిలో ఫొటోల ముందు నిలబడి ఆయన ఒక వీడియో బైట్ ఇచ్చారు. తన పుట్టిన రోజులు ఇప్పటిదాకా ఒక తరహాలో సాగిపోయాయని.. బర్త్ డే అంటే స్నేహితులతో పార్టీలు, మందు కొట్టడం, జాలీగా ఉండటం.. ఇలా సాగేదని.. కానీ తన 60వ పుట్టిన రోజు మాత్రం పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్యనే సాగిందని జగపతి వెల్లడించారు. దీన్ని పురస్కరించుకుని తన ఇద్దరు కూతుళ్లు యుఎస్ నుంచి 20 రోజుల ముందే ఇక్కడికి వచ్చిన తాను నటించిన సినిమాలకు సంబంధించి ఫొటోల సేకరణతో పాటు చాలా పనులు దగ్గరుండి చూసుకున్నారని.. ఇప్పుడిలా తనను సర్ప్రైజ్ చేశారని.. వారితో కలిసి తన పుట్టిన రోజున ప్రతి క్షణాన్నీ తాను ఆస్వాదించానని జగపతి తెలిపారు.
మామూలుగా మనం భార్యా పిల్లల కోసం ఎంత కష్టపడతామో వాళ్లకు తెలిసేలా చేయాలని అందరూ అంటుంటారని.. కానీ తాను అలాంటివి పట్టించుకోనని.. ఐతే తన పుట్టిన రోజుకు తన భార్యా పిల్లలు ప్లాన్ చేసిన తీరు చూస్తే తన కష్టమంతా వారికి అర్థమైందని తాను అర్థం చేసుకున్నట్లు జగపతి ఎమోషనల్‌గా అన్నారు.
This post was last modified on February 20, 2022 10:51 am
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…