భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయకా లాంటి చిత్రాల్లో నటించిన ఎస్తేర్ గుర్తుందా? తక్కువ సినిమాల్లో నటించి త్వరగా కనుమరుగైపోయిన ఈ భామ.. ఇప్పుడు సంచలన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చింది. ఆమె కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఛాన్సుల కోసం తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఎస్తేర్ వెల్లడించింది. సినిమా ఛాన్సులు కావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని తనను చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని కూడా తనను బెదిరించారని ఎస్తేర్ తెలిపింది.
తమతో పడుకోవాలని వాళ్లు నేరుగా అడగకపోయినా.. వాళ్ల మాటల్ని బట్టి ఆ విషయం అర్థమయ్యేదని ఆమె వెల్లడించింది. ఐతే అవకాశాల కోసం దిగజారాల్సిన అవసరం తనకు లేదని .. అందుకే అలా అడిగిన వాళ్లందరికీ ‘నో’ చెప్పానని ఎస్తేర్ తెలిపింది. బహ్రెయిన్‌కు చెందిన ఎస్తేర్ హిందీ సినిమాలతో కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత భీమవరం బుల్లోడుతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ఆపై కన్నడలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఒక టైంలో ఆమె కెరీర్ కాస్త ఆశాజనకంగానే కనిపించింది. కానీ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా స్థిరపడదామని జయజానకి నాయకా సినిమాలో చేసింది కానీ.. అది ఆమె కెరీర్‌కు ఆశించినంత ఊపు తీసుకురాలేదు.
తర్వాత తెలుగులో ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయింది. కన్నడలో మాత్రం మరికొన్ని సినిమాల్లో నటించింది. ఈలోపు గాయనిగానూ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేసింది ఎస్తేర్. ఈ క్రమంలోనే సింగర్ నోయల్‌తో ఆమె ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్తేర్ పెద్దగా వార్తల్లో లేదు. ఇప్పుడిలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఆమె వార్తల్లోకి వచ్చింది.
This post was last modified on February 20, 2022 1:42 am
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…