ఒకప్పుడు తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాల హవా ఏ స్థాయిలో ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమిళ అనువాదాలకు తెలుగు చిత్రాలు భయపడే పరిస్థితి ఉండేది. బాషా, నరసింహా, అపరిచితుడు, చంద్రముఖి, గజిని, శివాజి లాంటి సినిమాలు ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించాయో అప్పటి ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ గత దశాబ్దా కాలంలో తమిళ అనువాదాల హవా బాగా తగ్గిపోయింది.
మన సినిమాల క్వాలిటీ పెరగడం.. తమిళ చిత్రాల నాణ్యత పడిపోవడం ఒకేసారి జరిగి తెలుగులో తమిళ స్టార్లకు ఆదరణ బాగా తగ్గిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి తమిళ స్టార్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. ఇలాంటి టైంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించకుండా.. వాళ్లను అవమానపరిచేలా, చులకన చేసేలా తమిళ అనువాద చిత్రాలకు టైటిళ్లు పెడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.వచ్చే గురువారమే ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది ‘వలిమై’ సినిమా.
అజిత్ హీరోగా నటించని ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా.. దానికి కూడా ‘వలిమై’ అనే పేరు పెట్టి వదిలేస్తుండటం దారుణం. వలిమై అంటే తమిళంలో బలం అని అర్థం. తెలుగులో బలం అనో, బలిమి అనో పేరు పెట్టొచ్చు. లేదంటే ఇంకేదైనా ఆప్షన్ చూడొచ్చు. కానీ ‘వలిమై’ అనే తమిళ పేరే పెట్టి తెలుగులో రిలీజ్ చేస్తుండటం మన ప్రేక్షకులను అవమానపరచడం కాక మరేంటి? కనీసం తెలుగు టైటిల్‌కు కూడా మన వాళ్లు నోచుకోరా? అజిత్ సినిమా సంగతిలా ఉంటే.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి.. తన సినిమాల్లో ఎక్కడైనా బోర్డుల మీద తమిళ పేర్లు కనిపించినా.. వాటిని తెలుగులోకి మార్చి చూపించేంత కమిట్మెంట్ చూపించిన సూర్య సైతం ఇప్పుడు ఇదే దారిలో నడుస్తుండటం గమనార్హం.
‘ఎదర్కుం తునిందవన్’ పేరుతో సూర్య హీరోగా తమిళంలో ఒక సినిమా తెరకెక్కింది. దీన్ని షార్ట్‌గా ‘ఈటి’ అని పిలుస్తున్నారు తమిళంలో. తెలుగుతో పాటు ఇతర భాషలన్నింట్లో ఇదే టైటిల్ పెట్టి రిలీజ్ చేసేయబోతున్నారిప్పుడు. ‘ఈటి’ అనేది హీరో షార్ట్ నేమా అంటే అదీ కాదు. ‘దేనికి భయపడనివాడు’ అనే అర్థం వచ్చే టైటిల్‌ను తమిళంలో షార్ట్ చేసి అదే టైటిల్‌తో వేరే భాషల్లో రిలీజ్ చేయాలనుకోవడం విడ్డూరం. సూర్య లాంటి హీరో కూడా ఇలా చేస్తే ఇక మిగతా తమిళ హీరోల సంగతి చెప్పేదేముంది? ఇలాంటి తమిళ టైటిళ్లు పెట్టి రిలీజ్ చేసే సినిమాలను మన వాళ్లు బహిష్కరిస్తే తప్ప వీళ్లు మారరేమో.
This post was last modified on February 19, 2022 8:24 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…