చాలా కాలం తర్వాత `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
ఎస్.ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కాగా.. నిన్న తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ఫస్ట్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. అయితే అటు షూట్ మొదలైందో లేదో.. ఇటు బాలయ్య లుక్ బయటకు వచ్చేసింది.
ఇంకేముంది.. పెట్టిందెవరో కూడా పట్టించుకోకుండా అభిమానులు ఎంతో ఉత్సాహంగా బాలయ్య పిక్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడే ఓ అనుమానం మొదలైంది. తాజాగా బయటకు వచ్చిన ఫొటోలో బాలయ్య గెటప్ గానీ, ఆ షూట్ సెటప్ కానీ చూస్తుంటే కన్నడలో సూపర్ హిట్ సినిమా `మఫ్టి`నే గుర్తుకు వస్తోంది.
శివరాజ్‌కుమార్, శ్రీ మురళి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. 2017లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు రీమేక్‌గానే బాలయ్య-గోపీచంద్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందనే టాక్ ప్రస్తుతం బలంగా వినిస్తోంది. మరి దీనిపై మేకర్స్ స్పందిస్తే గానీ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
This post was last modified on February 19, 2022 5:24 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…