మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గానే సత్తా చాటుతూ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసింది. అదే `బబ్లీ బౌన్సర్`. బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితం కాబోతున్న ఈ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. బాక్సింగ్ నేపథ్యంలో బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో తమన్నా ఓ లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.
ఇండియాలో ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ కానుంది. ఇకపోతే ఈ పాన్ ఇండియా సినిమాతో తమన్నా తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందట. ఇంతకు ముందుకు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయిల వరకు పుచ్చుకున్న తమన్నా.. `బబ్లీ బౌన్సర్`కు మాత్రం ఏకంగా రూ. 4 కోట్లను డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారమే నిజమైతే ఇక తమన్నాను తట్టుకోవడం టాలీవుడ్ నిర్మాతలకు కష్టమే అవుతుందని అంటున్నారు సినీ ప్రియులు. కాగా, తమన్నా ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` సినిమాలో నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరో సత్యదేవ్‌తో `గుర్తుందా శీతాకాలం` అనే మూవీ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
This post was last modified on February 19, 2022 11:40 am
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…