ఒకప్పుడు కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కథానాయిక ప్రియమణి. ఆమె కొన్ని సినిమాల్లో ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. కొన్ని సిినిమాల్లో పెర్ఫామెన్స్‌తో అంతగా ఆకట్టుకుంది. ‘పరుత్తి వీరన్’ సినిమాకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన విషయం గుర్తుండే ఉంటుంది.
‘చారులత’ లాంటి కొన్ని సినిమాల కోసం ప్రియమణి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అది అవిభక్త కవలలకు సంబంధించిన సినిమా కావడంతో నిజ జీవితంలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్లను కలిసి అనుభవాలు పంచుకుంది ప్రియమణి. ఇప్పుడు టాలీవుడ్లోకి ‘విరాట పర్వం’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి.. అందులోనూ తాను చేసిన పాత్ర కోసం ఇలాంటి కమిట్మెంటే చూపించిందట.
‘విరాటపర్వం’లో ప్రియమణి నక్సలైట్ భారతక్క అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర చేయడం కోసం ఆమె నిజంగానే నక్సలైట్‌ను కలిసిందట. ‘విరాట పర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల సూచన మేరకు గతంలో నక్సలైట్‌గా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిన ఓ వ్యక్తిని ప్రియమణి కలిసి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుందట.
నక్సలైట్ల జీవన విధానం ఎలా ఉంటుంది.. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుంది.. లైఫ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాకే భారతక్క పాత్ర కోసం రంగంలోకి దిగిందట ప్రియమణి. హీరోయిన్‌గా ఫేడవుట్ అయిపోయాక కొన్నేళ్ల పాటు టాలీవుడ్ వైపు చూడని ప్రియమణి.. ఒకేసారి రెండు ముఖ్య పాత్రలు, పేరున్న సినిమాలతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.
రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లు కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’లో ఆమెది లీడ్ రోల్స్‌కు సమానమైన పాత్రే. అలాగే వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. పరిస్థితులు చక్కబడితే.. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on June 16, 2020 1:52 pm
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…