కెరీర్ స్టార్టింగ్‌లో తప్పులు చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది విషయంలో అది జరిగింది. ఇప్పుడు మరో నటి కూడా తప్పు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది. తనే కావ్యా థాపర్. ‘ఏక్ మినీ కథ’ సినిమాలో సంతోష్ శోభన్‌కి జోడీగా నటించిన ఈ అమ్మాయిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ పార్టీలో బాగా డ్రింక్ చేసిన కావ్య.. కారు నడుపుతూ ఒకరికి డ్యాష్ ఇచ్చింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్లు ఆమెని ప్రశ్నిస్తున్నప్పుడు బతిమాలుకోవాల్సింది పోయి ఆవేశంతో ఊగిపోయిందట.
గొడవ చేయడంతో పాటు అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా వాడిందట. వారిపై దాడికి కూడా దిగడంతో అరెస్ట్ చేసి లోపలేసినట్లు నార్త్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇరవయ్యారేళ్ల కావ్య చాలా యాడ్స్‌లో నటించింది. మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలోనూ ఒక సినిమా చేసింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
This post was last modified on February 19, 2022 8:05 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…