అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్న చైతు, సామ్‌లు కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.
ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు వీరిద్దరూ వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. ఇప్పటికే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. చైతు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెరకెక్కిస్తున్న ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో చైతు నటించనున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చైతు-సామ్ రూటులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అమెరికాకు చెందిన ఓ పాపులర్ వెబ్‌సిరీస్‌ను తెలుగులో తెరకెక్కించబోతోందట. అయితే ఈ సిరీస్‌లో హీరోగా నటించేందుకు నెట్‌ఫ్లిక్స్ వారు చరణ్‌ను సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది.
అంతేకాదు, ఈ వెబ్ సిరీస్‌కు గానూ చరణ్ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని, త్వరలోనే ఈ సిరీస్‌ను ఆఫీషల్‌గా అనౌన్స్ చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఈయన తన తదుపరి చిత్రాన్ని శంకర్‌తో స్టార్ట్ చేశాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు.
This post was last modified on February 18, 2022 11:40 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…