గత ఏడాది అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల వార్త తెలుగు అభిమానులను ఎంతగా బాధ పెట్టిందో తెలిసిందే. ఇప్పటికీ కూడా వాళ్లు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళంలో ఇదే స్థాయిలో అభిమానులను బాధ పెట్టింది ధనుష్-ఐశ్వర్యల విడాకుల వార్త. ఐశ్వర్య మామూలు వ్యక్తి కూడా కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. 18 ఏళ్ల పాటు వైవాహిక జీవితంలో ఉంటూ ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకోవడం అందరికీ పెద్ద షాక్.
వీళ్లిద్దరూ విడాకుల ప్రకటన విషయంలో తొందరపడ్డారని.. కుటుంబ సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలిసే అవకాశాలున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకుల కేసు కూడా ఫైల్ చేశారని.. రజినీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉండగా.. విడాకుల ప్రకటన చేయడం తప్ప ధనుష్, ఐశ్వర్య ఈ విషయమై మీడియాలో ఎక్కడా మాట్లాడలేదు.
ఐతే తాజాగా ఐశ్వర్య మాత్రం ఒక మీడియా ఇంటర్వ్యూలో విడాకుల గురించి పరోక్షంగా మాట్లాడింది. ధనుష్ పేరెత్తకుండా.. అతడితో మళ్లీ కలిసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. ‘‘జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని తప్పకుండా ఎదురుకోవాలని అన్నారు. అంతేకాదు ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ.
ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమే ప్రేమ. కానీ అది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. అయితే నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు’’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురానప్పటికీ.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య అనడం చూస్తే.. ధనుష్‌తో ఆమె మళ్లీ కలిసే అవకాశం లేదన్నది స్పష్టం.
This post was last modified on February 18, 2022 10:09 am
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…
ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్…
జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని…
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…