టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. కోలీవుడ్ లో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో అయితే క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. తెలుగులో కూడా బిజీగానే ఉంది. త్వరలోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.
ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో పూజాకి ఛాన్స్ వచ్చిందట. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఇప్పుడు మరోసారి అతడి సినిమాలో నటించమని దర్శకనిర్మాతలు పూజాను సంప్రదించారట. రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న చైతు.. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించారు.
ఇప్పటివరకు తమిళంలో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో మరో సినిమా ఒప్పుకుంటుందో లేక వదులుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దీన్ని కూడా విక్రమ్ కుమారే డైరెక్ట్ చేయనున్నారు. ఈ సిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 17, 2022 9:49 pm
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…