మెగా ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. రెజీనా కాసాండ్రా ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గత ఏడాది మే నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలె అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఆచార్య తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. అవును, ఈ సినిమా హిందీ వర్షన్‌ను పెన్ స్టూడియోస్ వారు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారంగా తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదలగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
కాగా, దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు నక్సలైట్లుగా కనిపించబోతున్నారు. అలాగే మణిశర్మ అందించే సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.
This post was last modified on February 17, 2022 1:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…