Movie News

బప్పీ.. నిను మరువగలమా?

కొవిడ్ కాలంలో మరో సంగీత దిగ్గజం దివికేగారు. 80, 90 దశకాల్లో భారతీయ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అనారోగ్యంతో కన్ను మూశారు. సినిమా సంగీతం ఒక శైలిలో.. సంప్రదాయబద్ధంగా సాగిపోతున్న రోజుల్లో బప్పీ.. మోడర్న్ టచ్‌తో మంచి ఊపున్న సంగీతంతో అప్పటి మ్యూజిక్ లవర్స్‌ను ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా ఆయన చేసిన డిస్కో, ర్యాప్ సాంగ్స్ అప్పటి యువతకు మామూలు కిక్ ఇవ్వలేదు.

మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాలో ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ అంటూ సాగే పాట ఇప్పటికీ మోర్మోగుతూనే ఉంటుంది. బప్పీ బేసిగ్గా బాలీవుడ్ సంగీత దర్శకుడే అయినా.. తెలుగు వాళ్లు ఆయన్ని అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బప్పీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు బప్పీ.

ఆ సినిమా పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా ‘ఆకాశంలో ఒక తార..’ సంగీత ప్రియుల్లో బాగా నానింది. అక్కడి నుంచి మొదలుపెడితే.. స్టేట్ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, నిప్పు రవ్వ, బిగ్ బాస్ లాంటి భారీ చిత్రాలకు ఆయన పని చేశారు. వీటిలో ప్రధానంగా చిరంజీవితో చేసిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు పాటలు ఎవర్ గ్రీన్.

వీటిలో ఏదో ఒక పాట అని కాదు.. ప్రతి పాటా సూపర్ హిట్టే. ‘వానా వానా వెల్లువాయి’ సహా ప్రతి ‘గ్యాంగ్ లీడర్’ పాటా అప్పట్నుంచి ఇప్పటి వరకు సంగీత ప్రియుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇక ‘రౌడీ అల్లుడు’లో ‘చిలుకా క్షేమమా’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలుగా ఒక కాలంలో వచ్చిన పాటలు.. కొన్నేళ్ల తర్వాత ఔట్ డేటెడ్ అనిపిస్తాయి. బప్పీ పాటలకు మాత్రం కాల దోషం లేదు. ఇప్పుడు విన్నా అవి తాజాగా.. ట్రెండీగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సంగీత ప్రియులు ఆయన్ని అంత సులువుగా మరిచిపోలేరు.

This post was last modified on February 16, 2022 5:09 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

33 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

42 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

42 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago