ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ ఫైనల్ గా మార్చి 11న విడుదల కావడానికి సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నప్పుడు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారంతే. బహుశా సినిమా వాయిదా పడుతుందని చిత్రబృందం ముందే ఊహించి ఉంటుంది. అయితే మార్చి 11న మాత్రం సినిమా రిలీజ్ కావడం పక్కా.
దానికి తగ్గట్లే ఈ నెల చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది. రిలీజ్ కి ముందు రెండు వారాల పాటు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ కి హీరోయిన్ పూజాహెగ్డే రాదని టాక్. మార్చి నెల మొత్తం పూజా డైరీ ఫుల్ అయిపోయిందట.
ఓ పక్క తమిళంతో పాటు హిందీ సినిమాలకు పూజాహెగ్డే డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు షూటింగ్స్ ను పక్కన పెట్టి ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో పాల్గొనలేనని చెబుతోందట పూజాహెగ్డే. ఆయా చిత్రనిర్మాతలు ఎవరైనా పర్మిషన్ ఇస్తే.. ఒకట్రెండు రోజులు మాత్రం ‘రాధేశ్యామ్’ టీమ్ కి సమయం కేటాయించగలదు. నార్త్ లో ప్రభాస్, పూజాలతో పాటు చిత్రబృందం మొత్తాన్ని తీసుకెళ్లి ఓ ఈవెంట్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. మరి దానికి పూజాహెగ్డే రాకపోతే కలరింగ్ ఉండదు.
తెలుగు ఈవెంట్స్ కి పూజా రాకపోయినా.. బాలీవుడ్ లోనైనా ఆమె సినిమాను ప్రమోట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి పూజాహెగ్డే ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తమన్ బీజీఎమ్ అందించారు.
This post was last modified on February 15, 2022 6:53 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…