మహానుభావుడు సినిమా తర్వాత ఇంతవరకు ఒక్క మంచి హిట్టు కూడా దక్కలేదు శర్వానంద్‌కి. దాంతో మంచి నటుడిగా పేరు వస్తున్నా కమర్షియల్ హీరోగా స్టార్‌డమ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం అంటూ చాలా రకాల జానర్లు ట్రై చేసినా కాసులు రాబట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. అందుకేనేమో.. ఈసారి ఆడవాళ్ల సపోర్ట్ తీసుకున్నాడు శర్వా.
లెక్కలేనంతమంది లేడీ క్యారెక్టర్స్‌తో కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్లంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రీసెంట్‌గా రిలీజైన టీజర్‌ని బట్టి ఇది ఫన్ అండ్ ఎమోషన్స్ మిక్స్ చేసిన కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థమయ్యింది. మూవీపై ఆసక్తి పెరిగింది. ఈ నెల 25న సినిమా విడుదల చేస్తామని టీమ్ కూడా ప్రకటించింది. ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. దాంతో మూవీ రెడీ అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి.. సినిమా షూటింగ్ ఇప్పటికి పూర్తయ్యింది. తమ సినిమా షూటింగ్ పూర్తయ్యిందంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అనౌన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
పది రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పటి వరకు షూటింగ్ చేయడమేంటి అంటున్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇలా జరుగుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్నా వర్క్ పూర్తి కావడం లేదు. దాంతో చివరి నిమిషంలో రిలీజ్ ఆపి, మరో డేట్‌ని ఫిక్స్ చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే షూట్ కంప్లీటైన విషయాన్ని చెబుతూ ఫిబ్రవరి 25న సినిమా రిలీజ్ అని మరోసారి కన్‌ఫర్మ్ చేశారు కాబట్టి, శర్వా సినిమాకి అలాంటి పరిస్థితి రాదనే అనిపిస్తోంది.
This post was last modified on February 14, 2022 8:27 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…