ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో హిందీ ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ మృణాల్ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చింది.
తన ప్రేమ, బ్రేకప్ వంటి విషయాలపై స్పందించింది. పెళ్లి, పిల్లలు అని కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో వచ్చిన అవకాశాలను వినియోగించుకొని, ఇప్పుడు నటిగా రాణిస్తున్నానని తెలిపింది. అయితే ఈ ఫీల్డ్ లో ఉండడం వలన ఏడు నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని చెప్పింది మృణాల్. ఇండస్ట్రీని కారణంగా చెప్పడంతో షాక్ అయ్యానని.. నటిని కావడం వలనే తనను వదిలేశాడని స్పష్టం చేసింది.
తను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడని.. పద్ధతులు బాగా ఫాలో అవుతాడని చెప్పింది. కొన్నాళ్లపాటు ఒకరినొకరం ప్రేమించుకున్నామని.. కానీ నటి కావడం ఆయనకు ఇష్టం లేకపోవడంతో వదిలేశాడని.. కానీ అతడిపై కోపం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. ఒకవేళ అడ్జస్ట్ అయి రిలేషన్ లో ముందుకువెళ్లినా.. తరువాత మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉందని.. కాబట్టి ఇప్పుడే విడిపోవడం మంచిదని చెప్పుకొచ్చింది.
This post was last modified on February 13, 2022 10:42 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…