దేశంలో అతిపెద్ద బ్యాంకు ఫ్రాడ్ బయటపడింది. గుజరాత్ లోని ఒక వ్యాపార సంస్ధ బ్యాంకులను రు. 22,842 కోట్లను చేసిన మోసంపై సీబీఐ కేసు నమోదుచేసింది, ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసిన అతిపెద్ద ఘటనగా తాజా కేసు రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్ధ ఉంది. ఈ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని మోసం చేసినట్లు బయటపడింది.
సంస్ధ మాజీ ఛైర్మన్, ఎండీ రిషీ కమలేష్ అగర్వాల్ తో పాటు శంతనం ముత్తుస్వామి, అశ్వనీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవేతియా తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత మోసం, కుట్ర, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం లాంటి అనేక కేసులను సీబీఐ నమోదు చేసింది. సూరత్ , బరూచ, ముంబయ్ , పూణే తదితర ప్రాంతాల్లోని సంస్ధ ఆఫీసులపై దాడులు చేసి కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన మోసాన్ని ఎస్బీఐ 2019లోనే గుర్తించి వెంటనే ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో సీబీఐ మరిన్ని వివరాలను కోరింది. అయితే 2020 ఆగష్టులో మరోసారి బ్యాంకు రెండోసారి ఫిర్యాదు చేసింది. చివరకు ఈనెల 7వ తేదీన బ్యాంకు పై సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ సంస్థ 28 బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది. ఎస్బీఐ నుండే రు. 2,468 కోట్లు అప్పు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది.
బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను నిందితులంతా భారీ ఎత్తున దారి మళ్ళించినట్లు సీబీఐ గుర్తించింది. ఏ కారణంతో అయితే అప్పులు తీసుకున్నారో దానికి భిన్నంగా నిధులను మళ్ళించినట్లు ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడింది. మరింత పెద్ద ఎత్తున జరిగిన మోసంలో నిందితులకు ఎప్పటికి శిక్షలు పడతాయో ? ఇంతకుముందే మోసాలు బయటపడి, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ వ్యవహారాలు ఎప్పటికి తేలుతాయో ఎవరికీ అర్థం కావటం లేదు.
This post was last modified on February 13, 2022 9:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…