భాషతో పని లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. రజినీకాంత్ అంటే రజినీకాంతే. ఆయన సినిమా అంటే యావత్ దేశమంతా క్రేజే. నిజానికి ఓ మంచి హిట్టు రజినీ ఖాతాలో పడి చాలా కాలమే అయ్యింది. అయినా ఇప్పటికీ ఆయన ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై భారీ అంచనాలు ఏర్పడటం ఆగడం లేదు.
రీసెంట్‌గా ‘పెద్దన్న’గా వచ్చిన రజినీ.. ఓపెనింగ్స్ అయితే రాబట్టారు కానీ కాన్సెప్ట్ పరంగా మెప్పించలేకపోయారు. అసలే ఆరోగ్యం బాలేకపోవడానికి తోడు మరో యావరేజ్ సినిమాని లిస్టులో వేసుకోవడంతో ఆయన ఇక సినిమాలు చేస్తారా లేక ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా అనే డౌట్ కూడా అందరికీ వచ్చింది. ఆ అనుమానాలన్నింటికీ కొత్త అనౌన్స్‌మెంట్‌తో చెక్ పెట్టేశారు రజినీ.
రజినీ 169 సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నయనతారతో ‘కొ కొ కోకిల’, శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ చిత్రాలు తీసిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. ప్రస్తుతం విజయ్‌తో ‘బీస్ట్’ చిత్రాన్ని తీస్తున్నాడు నెల్సన్. అది పూర్తి కావస్తుండటంతో ఈ మూవీని సెట్స్‌కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో కానీ మే ఫస్ట్ వీక్‌లో కానీ షూటింగ్ స్టార్టవబోతోంది. వచ్చే యేడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని కూడా ఫిక్సైనట్లు తెలుస్తోంది.
ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనరే అయినా.. ఓ స్ట్రాంగ్ స్టోరీ లైన్‌తో రాబోతోందట. ప్రస్తుతం రజినీకి కావాల్సింది అదే. కార్తీక్ సుబ్బరాజ్ అయినా, మురుగదాస్ అయినా, శివ అయినా.. ప్రతి ఒక్కరూ ఆయన స్టైల్‌పై, మేనరిజమ్స్‌పై కాన్సన్‌ట్రేట్ చేశారే తప్ప ఓ మంచి కథతో రజినీ ఇమేజ్‌ని మరింత పెంచే ప్రయత్నం చేయలేకపోయారు. కనీసం నెల్సన్ అయినా ఆ పని చేస్తే తలైవా అభిమానులకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు.
This post was last modified on February 10, 2022 9:27 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…