Movie News

సుధీర్ బాబును హ‌ర్ట్ చేసిన ఆ మాట‌లు

నిన్న‌టిత‌రం సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, ఈ త‌రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బావ‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుధీర్ బాబు.. హీరోగా అరంగేట్రం చేశాక కొన్నేళ్లు చాలా విమ‌ర్శ‌లే ఎదుర్కొన్నాడు. అత‌డి న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ విష‌యంలో చాలా ట్రోలింగ్ జ‌రిగింది. కెరీర్ ఆరంభంలో స‌రైన విజ‌యాలు కూడా అందుకోలేదు. అత‌ను హీరోగా నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు.

కానీ క‌ష్ట‌ప‌డి న‌ట‌న స‌హా అన్ని విష‌యాల్లో మెరుగుప‌డ్డాడు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, స‌మ్మోహ‌నం, న‌న్ను దోచుకుందువ‌టే లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు. ఐతే కెరీర్ ఆరంభంలో త‌న‌పై వచ్చిన విమ‌ర్శ‌ల గురించి త‌న‌కు తెలుస‌ని.. అందులోనూ ఒక సినిమా షూటింగ్ సంద‌ర్భంగా కెమెరామ‌న్ అన్న మాట‌లు త‌న‌ను బాధించాయ‌ని సుధీర్ బాబు తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

త‌న తొలి సినిమా స‌మ‌యంలో దాని కెమెరామ‌న్ త‌న అసిస్టెంట్ల‌తో మాట్లాడుతూ.. త‌న‌ది ఫొటోజెనిక్ ఫేస్ కాదు.. ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేడు.. అన్న విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని.. ఆ మాట‌లు విని తాను ముందు చాలా బాధగా అనిపించిన‌ప్ప‌టికీ.. ఆ మాట‌లే త‌ర్వాత నేనేం చేయాలో ఆలోచించుకునేలా చేశాయ‌ని.. ఆ వ్య‌క్తికి త‌న‌పై ఉన్న నెగెటివ్ ఇంప్రెష‌న్ న‌టుడిగా త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని సుధీర్ చెప్పాడు.

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ చూశాక ఇక తాను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌హేష్ చెప్పాడ‌ని.. ఆ మాట‌లు త‌న‌పై త‌న‌కెంతో న‌మ్మ‌కాన్నిచ్చాయ‌ని చెప్పాడు సుధీర్. తొమ్మిదేళ్ల త‌న ప్ర‌యాణంలో ఇప్ప‌టిదాకా త‌న‌కీ సినిమా చేసిపెట్ట‌మ‌ని మ‌హేష్‌ను కానీ, కృష్ణ‌ను కానీ ఫేవ‌ర్ అడ‌గ‌లేద‌ని.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు త‌న న‌ట‌న న‌చ్చి త‌న‌ను గౌర‌విస్తున్నార‌ని భావిస్తున్న‌ట్లు సుధీర్ తెలిపాడు.

This post was last modified on February 10, 2022 12:18 pm

Share

Recent Posts

మౌళిని కమర్షియల్ వింగ్‌లోకి లాగుతున్నారా

గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ…

8 hours ago

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

10 hours ago

మిథున్ రెడ్డి ఎక్కడున్నారు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయ‌న ఆచూకీ కూడా క‌నిపించ‌డం…

11 hours ago

బెజవాడలో వంగవీటి వన్‌మ్యాన్ షో

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…

11 hours ago

తమన్ స్టేట్‌మెంట్‌లో ఇంత అతిశయమా

తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి…

11 hours ago

పోలికల పర్వానికి శుభం కార్డు పడినట్టే

ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ జరుగుతున్న సమయంలో తెగ తిరిగిన ప్రచారం ఒకటుంది. అర్జున్ బ్లాస్ట్ జోన్ కథకు…

12 hours ago