కొత్త ఏడాదిలో ఇప్పటిదాకా రిలీజైన చిత్రాలన్నింట్లో కొంచెం పెద్ద స్థాయి ఉన్నది, ఎక్కువ అంచనాలతో వచ్చింది బంగార్రాజు సినిమానే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు తక్కువైనప్పటికీ.. ఈ సినిమా అక్కడ చాలా బాగా ఆడింది. బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
తెలంగాణలో మాత్రం బంగార్రాజు అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ రెండో వారంతోనే ముగిసిపోగా.. అప్పట్నుంచి ఓటీటీ ప్రేక్షకులు డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే థియేటర్లలో రిలీజ్ చేసిన నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి తేవాలని చిత్ర బృందం వేచి చూసింది. ఎట్టకేలకు ఈ సినిమాకు డిజిటల్ ప్రిమియర్స్ కన్ఫమ్ అయ్యాయి.
ఫిబ్రవరి 18న బంగార్రాజు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి జీ సినిమాస్ వాళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. డిజిటల్ రైట్స్ వారి దగ్గరే ఉన్నాయి. జీ 5లో 18 నుంచి బంగార్రాజు సందడి చేయబోతున్నాడు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కడం తెలిసిందే. మూణ్నాలుగేళ్లు ఈ సినిమా స్క్రిప్టు మీద పని చేశాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల.
ఐతే ఇన్నేళ్లు కసరత్తు చేసిన స్క్రిప్టులా సినిమా చూస్తున్నపుడు ఎంతమాత్రం అనిపించలేదు. నాగార్జున సందడి మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. సోగ్గాడే..తో పోలిస్తే బంగార్రాజు చాలా సాధారణమైన సినిమా. ఈ సినిమా పెద్ద హిట్టయితే ఈ సిరీస్‌లో ఇంకో చిత్రం అనుకున్నారు కానీ.. ఇప్పుడది సందేహంగానే ఉంది. నాగ్‌తో పాటు నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ఇందులో కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
This post was last modified on February 10, 2022 8:25 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…