‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టలేదు రామ్ చరణ్. ఆ సినిమా చివరి దశకు వచ్చాక శంకర్‌తో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఆ సిమూవీ షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. తన ఒరిజినల్ శైలికి భిన్నంగా కాస్త వేగంగానే ఈ ప్రాజెక్టును లాగిస్తున్నాడు శంకర్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా.
ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్‌గా చరణ్ నటిస్తున్నాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. అది నిజమో కాదో తెలీదు కానీ.. ఈ సినిమా కథ మాత్రం శంకర్‌ది కాదని తేలింది. ఈ మూవీకి స్టోరీ అందించింది మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.
లాక్ డౌన్ టైమ్‌లో శంకర్ చాలామంది దర్శకులతో మాట్లాడాడట. వారిలో కార్తీక్ కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్‌ని శంకర్ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్ తీస్తున్నది అదే కథ.
ఈ విషయాలన్నీ రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అతని మాస్ కథకి శంకర్ క్లాస్ టేకింగ్ కలిస్తే ఎలా తయారవుతుందో చూడాలి మరి.
This post was last modified on February 9, 2022 10:23 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…