సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ కనిపించబోతుందని సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాల ద్వారా ఒకప్పటి హీరోయిన్లకు అవకాశాలు ఇస్తుంటారు. నదియా, టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలతో కొంతమంది నటీమణులకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటిని తన సినిమా కోసం సంప్రదిస్తున్నారట త్రివిక్రమ్.
ఆమె ఎవరంటే రాధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది అగ్ర హీరోలతో ఆడిపాడింది. తరువాత కాలం అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఆమె ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు కానీ తల్లి మాదిరి షైన్ అవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రాధా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో కూడా కలిసి సినిమాలు చేసిన రాధ ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on February 9, 2022 7:46 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…