రికార్డు ధ‌ర‌కు `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రైట్స్‌?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలం నుంచి హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. `శతమానంభవతి` త‌ర్వాత ఈయ‌న న‌టించిన రాధ, రణరంగం, జాను, శ్రీ‌కారం, మ‌హాస‌ముద్రం చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అయితే శ‌ర్వా తాజాగా న‌టించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.

ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని శ‌ర్వానంద్ తెగ తాప‌త్రాయ‌ప‌డుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయ‌ట‌.

సోష‌ల్ మీడియాలో జోరుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ మ‌రియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్  సొంతం చేసుకున్నార‌ట‌. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్ల‌ను చెల్లించారని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వానంద్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్‌ ఇదే అవుతుంది.