సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయకపోతే అక్షయ్ కుమార్‌కి నిద్ర పట్టదు. కరోనా కారణంగా అతడు నటించిన చాలా సినిమాలు రిలీజ్‌కి నోచుకోక వెయిటింగ్‌లో ఉన్నాయి. అయినా కూడా తన మానాన తను కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ.. వాటిని వెంటవెంటనే పట్టాలెక్కిస్తూ పోతున్నాడు.
అక్షయ్ కుమార్ హీరోగా నిన్న కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి బడేమియా చోటేమియా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్‌తో చాలా సంవత్సరాల క్రితం అమితాబ్, గోవిందా ఓ సినిమా చేశారు. వరుణ్ ధావన్ డైరెక్ట్ చేశాడు.
అయితే అది ఓ కామెడీ సినిమా. ఇప్పుడు అక్కీ, టైగర్ చేస్తున్నది మాత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్. అనౌన్స్‌మెంట్ టీజర్‌లో హీరోలిద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. వెపన్స్‌తో శత్రువుల మీద విరుచుకు పడుతున్నారు. తమ సినిమా పేరుతో పాటు 2023 క్రిస్‌మస్‌కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కూడా వీడియో ద్వారానే చెప్పారు.
ఈ జానర్ సినిమాలు తీయడంలో జాఫర్ సిద్ధహస్తుడని సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టే అక్షయ్, టైగర్ లాంటి హీరోలతో సినిమా ప్లాన్ చేశాడంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీప్‌శిఖా దేశ్‌ముఖ్‌తో కలిసి రకుల్‌కి కాబోయే భర్త జాకీ భగ్నానీ, అతని తండ్రి వశు భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on February 9, 2022 7:12 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…