యంగ్ హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది మీనాక్షి చౌదరి. చండీఘర్ కి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బీడీఎస్ కోర్స్ చేస్తుంది. చదువుకుంటూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది మీనాక్షి. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో రవితేజకి లిప్ లాక్ ఇస్తూ కనిపించింది ఈ బ్యూటీ.
ఈ లిప్ లాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది మీనాక్షి. యాక్టింగ్ క్లాసుల్లోనే ఇవన్నీ తెలుసుకొనే ఇండస్ట్రీకి వచ్చానని చెబుతోంది. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కామన్ అని.. దర్శకుడు కథ చెప్పినప్పుడే క్యారెక్టర్ తీరు గురించి వివరించారని తెలిపింది.
లిప్ లాక్ సీన్స్ తన పాత్ర స్వభావాన్ని బట్టి పెట్టారని చెప్పుకొచ్చింది. కొన్ని సన్నివేశాల్లో నటించేప్పుడు భయపడుతూ ఉంటే కంఫర్ట్ అయ్యేవరకు టైం తీసుకోమని రవితేజ సూచించేవారని తెలిపింది. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశానని.. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్పింది. అన్నీ హ్యూమన్ ఎమోషన్సే అని.. అంతకుమించి లైన్ క్రాస్ చేయమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. మీనాక్షికి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ‘సలార్’లో సెకండ్ హీరోయిన్ గా ఈమెను తీసుకున్నట్లు ప్రచారం జరగగా.. దానిపై స్పందించింది ఈ బ్యూటీ. ఇంకా ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాలేదని క్లారిటీ ఇచ్చింది. తెలుగులో మరో రెండు సినిమాలో డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పింది. తెలుగులో అడివి శేష్ సరసన ‘హిట్ 2’, తమిళంలో విజయ్ ఆంథోనీ సరసన ‘కొలై’ వంటి సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది.