బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తాలూకు షాక్ నుంచి అతడి అభిమానులు ఒక రోజు గడిచాక కూడా తేరుకోలేకపోతున్నారు. మంచి స్థాయిలో ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్‌తో కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఐతే హీరోగా ఎంత మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. బాలీవుడ్లో అతడి సరైన స్నేహితులు లేరని, స్టార్ కిడ్స్‌తో నిండిపోయిన బాలీవుడ్ అతణ్ని ఓన్ చేసుకోలేదని.. లాక్ డౌన్ వేళ అతణ్ని ఒంటరితనం వేధించిందని.. ఇప్పటికే ఉన్న మానసిక సమస్యలు ఇంకా పెద్దవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని బాలీవుడ్ వర్గాలు అంటుున్నాయి. సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్న విషయం అభిమానులకు కొత్త కానీ.. బాలీవుడ్ జనాలకు తెలియంది కాదని అక్కడి మీడియా వర్గాల సమాచారం.
సుశాంత్ మానసిక సమస్యలతో బాధ పడుతున్న విషయం ఆరు నెలల కిందటే వెల్లడైందట. కానీ ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఎవ్వరూ అతడికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ విషయమై ఇప్పుడు సుశాంత్ అభిమానులు బాలీవుడ్ ప్రముఖుల మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య సంగతి తెలిసి కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సుశాంత్‌తో టచ్‌లో లేకపోవడం తన తప్పే అన్నాడందులో. ఐతే ఈ పోస్ట్ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరణ్ ఫోకస్ ఎప్పుడూ స్టార్ కిడ్స్ మీదే ఉంటుందని.. సొంతంగా ఎదిగే వాళ్లను అతను పట్టించుకోడని, పైగా చిన్న చూపు చూస్తాడని.. గతంలో తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వచ్చిన సుశాంత్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో అతడితో టచ్‌లో లేనందుకు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. సుశాంత్ లాంటి వాళ్లు ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడటానికి కరణ్ లాంటి వాళ్లే కారణం అని అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on June 15, 2020 1:47 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…