సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళుడే కానీ.. భాషా భేదం లేకుండా కెరీర్ ఆరంభంలోనే అతను సూపర్ పాపులారిటీ సంపాదించాడు. కొలవరి పాటలతో అతను రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. అప్పట్నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పాటతో రచ్చ చేస్తూనే ఉన్నాడు. అతడి పాటల్ని తమిళులే కాక అందరూ ఎంజాయ్ చేస్తుంటారు.
గత ఏడాది మాస్టర్ సినిమా కోసం అతను కంపోజ్ చేసిన వాత్తి ింగ్ పాట ఏ స్థాయిలో సంచలనం రేపిందో తెలిసిందే. ఉత్తరాది జనాలను సైతం ఈ పాట ఊపేసింది. డ్యాన్స్, మ్యూజిక్ షోలన్నింట్లో ఈ పాట హోరెత్తిపోయింది. తమిళంలో ఇలాంటి వాటిని కుత్తు పాట అంటుంటారు. మాస్ ప్రేక్షకులు ఊగిపోయేలా చేసే పాటల్ని ఇలా అంటుంటారు. తన ప్రతి సినిమాలో ఇలాంటి కుత్తు పాట ఒకటైనా ఉండేలా చూసుకుంటాడు అనిరుధ్. ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు.
ఇప్పుడతను విజయ్ కొత్త సినిమా బీస్ట్ కోసం ఒక వెరైటీ పాటనే రెడీ చేసినట్లున్నాడు. దీన్ని అరబిక్-కుత్తు సాంగ్ అని పేర్కొంటుండటం విశేషం. ఈ పాట వేలంటైన్స్ డే కానుకగా విడుదల కాబోతోంది. దీని ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అనిరుధ్, దర్శకుడు నెల్సన్, ఈ పాట రాసిన హీరో శివ కార్తికేయన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా అరబిక్ స్టయిల్లో కుత్తు సాంగ్ చేద్దామంటూ నెల్సన్, అనిరుధ్ రెడీ అవడం.. ఈ పాట రాయడానికి శివకార్తికేయన్‌ను పిలిపించడం.. ఒకరి మీద ఒకరు పంచులేసుకోవడం.. తర్వాత హీరో విజయ్‌కి ఫోన్ చేసి పాట వినిపిస్తే ఇదేం పాట అంటూ అతనూ కౌంటర్ వేయడం.. ఇలా భలే వెరైటీగా సాగింది ప్రోమో. చివర్లో ట్యూన్ కొద్దిగా వినిపించగా.. పాటలో మంచి ఊపున్నట్లు, వెరైటీగా సాగబోతున్నట్లు అర్థమైంది. చూస్తుంటే ఈ పాటతో అనిరుధ్ మరోసారి సెన్సేషణ్ క్రియేట్ చేసేలాగే ఉన్నాడు.
This post was last modified on February 8, 2022 8:18 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…