బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా అనే హీరో ఉన్నాడు. అద్భుతంగా నటిస్తాడు. అంతకంటే అద్భుతంగా రాస్తాడు. అంతకు మించి సూపర్బ్‌గా పాడతాడు. మల్టీ టాలెంట్స్‌తో మెస్మరైజ్ చేసేయడం ఆయుష్మాన్ స్టైల్. మనకీ ఓ ఆయుష్మాన్ ఉన్నాడు. తనెవరో కాదు.. సిద్ధు జొన్నలగడ్డ. చెప్పాలంటే ఆయుష్మాన్ కంటే ఓ టాలెంట్ ఎక్కువే ఉంది మనోడికి. ఎడిటింగ్ కూడా చేయగలడు.
చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారిన సిద్ధు.. మొదట్లో అందరికీ ఓ మామూలు నటుడిలానే కనిపించాడు. కానీ అతడు చేస్తున్న ఒక్కో పాత్ర చూస్తుంటే యాక్టర్‌గా చాలా మెట్లు ఎక్కుతూ పోతున్నాడని అర్థమవుతోంది. ‘డీజే టిల్లు’ ట్రైలర్ చూశాక అతడు రైటర్‌గా కూడా చాలా ఎదిగాడని స్పష్టమవయ్యింది. ముఖ్యంగా డైలాగ్స్ చించేశాడని అందరూ పొగిడేస్తున్నారు.
అలా అని పెన్ను పట్టడం తనకేమీ కొత్త కాదు. ‘గుంటూర్ టాకీస్’ సినిమాకి కథ, డైలాగ్స్ తనే రాశాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకి రైటర్‌గానే కాక ఎడిటర్‌గానూ వర్క్ చేశాడు. తర్వాత ‘మా వింత గాథ వినుమా’కి రచన, ఎడిటింగ్‌తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ పాత్ర కూడా పోషించాడు. ఇప్పుడు డీజే టిల్లు విషయంలోనూ మల్టీ టాస్కింగ్ చేశాడు.
ఫిబ్రవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సిద్ధునే రాశాడు. దర్శకుడిగా తానెంత చేశాడో సిద్ధు కూడా అంతే వర్క్ చేశాడని డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా సిద్ధుని తెగ పొగిడేస్తున్నాడు. సిద్ధు పెన్ పవరేంటో సినిమా చూశాక పూర్తిగా తెలుస్తుందంటున్నాడు. ఇక సిద్ధులోని సింగర్ కూడా ఈ సినిమా కోసం మరోసారి బైటికొచ్చాడు.
గతంలో గుంటూరు టాకీస్’ టైటిల్ ట్రాక్ పాడిన సిద్ధు, ‘నరుడా డోనరుడా’ అనే సినిమాలోనూ ఓ పాట పాడాడు. ఇప్పుడు ‘డీజే టిల్లు’ కోసం ‘నీ కనులను చూశానే ఓ నిమిషం లోకం మరిచానే’ అంటూ పాటందుకున్నాడు. కాసేపటి క్రితమే విడుదలైన ఈ ఎమోషనల్ సాంగ్‌తో సిద్ధులోని మెచ్యూర్డ్ సింగర్ స్పష్టంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ యంగ్ హీరో రకరకాల టాలెంట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
This post was last modified on February 7, 2022 10:45 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…