బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య భారతీయ సినీ పరిశ్రమను ఎంతటి షాక్‌కు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు. నటుడిగా మంచి గుర్తింపు పొంది, స్టార్ హోదాను అనుభవిస్తున్న సుశాంత్.. ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఈ వార్త తెలిసిన సినీ జనాలు షాక్‌లోకి వెళ్లిపోయారు.
సామాన్య ప్రేక్షకులకే ఈ విషాదాంతం కన్నీళ్లు తెప్పిస్తుంటే.. ఇక సినిమా వాళ్ల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఐతే తెలుగులో ‘బుజ్జిగాడు’ సహా కొన్ని సినిమాలు చేసిన కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ సుశాంత్ మృతి మీద ఓ టీవీ ఛానెల్ చర్చలో మాట్లాడుతున్నపుడు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఓ హిందీ ఛానెల్ ఈ విషాదాంతంపై చర్చలో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రెటీలను లైన్లోకి తీసుకుంది. అందులో సంజన కూడా ఒకరు.
ఐతే ఈ చర్చ నడుస్తుండగా.. మధ్యలో తనపై కెమెరా ఫోకస్ లేదనుకుందో ఏమో గానీ, సంజన మేకప్ కిట్ బయటికి తీసి టచప్ చేసుకునే ప్రయత్నం చేసింది. సీరియస్‌గా చర్చ నడుస్తుండగా.. సంజన మేకప్ సరి చేసుకుంటున్న దృశ్యం కనిపించడంతో వీక్షకులు షాకయ్యారు. దాని వరకు వీడియో కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సంజన మీద బూతుల వర్షం కురిపించారు నెటిజన్లు. సిచువేషన్ ఎలాంటిదైనా.. ఈ హీరోయిన్లకు మేకపే ముఖ్యం.. ఒక విషాదం గురించి స్పందించేటపుడు మేకప్ మీద అంత ఫోకస్ అవసరమా అన్న కామెంట్లు వినిపించాయి.
ఇదిలా ఉంటే.. సుశాంత్ మృతికి సంబంధించిన కవరేజీ విషయంలో మీడియా హద్దులు దాటడం మీదా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడి మృతదేహానికి సంబంధించిన ఫొటోలను మీడియా షేర్ చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే కొడుకు మృతితో షాక్‌లో ఉన్న సుశాంత్ తండ్రి ఇంటికి వెళ్లి ఆయన ముందు మైక్ పెట్టి మాట్లాడమనడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 15, 2020 3:09 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…