టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట. కానీ, త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ లీడ్ రోల్ అంటేనే హీరోయిన్లు భయపడిపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా నటించిన వారిందరూ కెరీర్ పరంగా చాలా వెనకపడిపోయారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా మూవీలో మెయిన్ హీరోయిన్‌గా ఇలియానా నటించగా.. సెకెండ్ హీరోయిన్‌గా పార్వతీ మెల్టన్ నటించింది. కానీ, ఈ మూవీ అనంతరం పార్వతీ మెల్టన్ టాలీవుడ్‌లో ఎక్కువ కాలం నెలదొక్కుకోలేకపోయింది.
ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీలో ప్రణీత, సన్నాఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అ ఆలో అనుపమా పరమేశ్వరన్, అజ్ఞాతవాసిలో అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత వీర రాఘవలో ఈశా రెబ్బా, అల వైకుంఠపురములో మూవీలో నివేతా పేతురాజ్‌లు సెకెండ్ హీరోయిన్‌గా నటించారు. అయితే వీరందరూ ప్రస్తుతం కెరీర్ పరంగా వెనకపడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరూ ముందుకు రావడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 6, 2022 12:38 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…