తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నెటిజన్లు ఒకింత సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. సాధారణంగా కేసీఆర్‌పై నెటిజన్లు చాలా అభిమానం చూపుతారు. ఆయనను పెద్దగా కించపరిచేలా ఎవరూ వ్యాఖ్యలుచేయరు. కానీ, తాజాగా జరిగిన పరిణామంలో మాత్రం ఒకింత సూటిగానే ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సార్.. ఇది భావ్యమేనా? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అని కొందరు అడిగారు. మరికొందరు.. ప్రతిదాన్నీ రాజకీయంగానే చూస్తారా? అని నిలదీశారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. తాజాగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం అయిన.. రామానుజార్యుల సమతామూర్తి రూపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ.. ఆవిష్కరించారు.
అయితే.. ఈ కార్యక్రమానికి అంటే.. విగ్రహ ఏర్పాటు.. సమతా మూర్తి స్థలం ఇవ్వడం.. ఇలా.. అనేక విషయాల్లో ఆది నుంచి సూచనలు, సలహాలు.. నిధులు కూడా ఏర్పాటు చేసిన.. సీఎం కేసీఆర్.. చివరి నిముషంలో గైర్హాజరయ్యారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం కేసీఆర్.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్నప్రధాని మోడీకి విమానాశ్రయంలో స్వాగతం పలకడమే కాకుండా.. హైదరాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉండాల్సి ఉంది. అయితే.. కేసీఆర్ హఠాత్తుగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన స్థానంలో ఎవరినీ పంపించలేదు.
ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం లేదని పేర్కొన్నాయి. నిజానికి, ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదన్న ప్రచారం శుక్రవారమే జరిగింది. ఇందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారంటూ నియామక పత్రం ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. నిజానికి రాష్ట్ర రాజధాని కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రధాని హాజరైతే గవర్నర్, ముఖ్యమంత్రి, నగర మేయర్, సీఎస్, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలంటూ ప్రొటోకాల్ నిబంధన ఉంది.
అయితే, అనధికార కార్యక్రమాలకు హాజరైతే గవర్నర్, సీఎం స్వాగత కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని, వారు తమ అభిమతం మేరకు ప్రధానిని కలవాలనుకుంటే కలవవచ్చు. ఈ నిబంధన కేసీఆర్‌కు కలిసి వచ్చిందని, బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
వివాదాలు.. చాలానే!
కేంద్రంలోని మోడీతో కేసీఆర్‌కు వివాదాలు చాలానే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం. ఐఏఎస్‌లను బలవంతంగా బదిలీ చేయించే సవరణకు కేసీఆర్ అడ్డు చెప్పడం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోడీపై కేసీఆర్ నిప్పులు చెరగడం తెలిసిందే. ధీనికి ముందు కూడా పలు అంశాల్లో కేసీఆర్ విభేదించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీని నేరుగా కలిసి.. స్వాగతం చెప్పే కార్యక్రమాన్ని రాజకీయంగానే ఆయన చూస్తున్నారనే వాదన పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. నెటిజన్లు దీనిని తప్పు పడుతున్నారు. ఏదేమైనా.. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేదని.. పోనీ.. ఆయనకు అనారోగ్యంగా ఉండి ఉంటే.. తన కుమారుడినైనా పంపించి ఉంటే బాగుండేదని.. అంటున్నారు.
This post was last modified on February 6, 2022 6:54 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…