Movie News

హాట్ టాపిక్.. వీడు మామూలోడు కాదు

కెరీర్ ఆరంభంలో కొందరు నటుల్ని చూసి తేలిగ్గా తీసుకుంటాం. చిన్న చిన్న పాత్రల్లో వాళ్లను చూసినపుడు వాళ్ల టాలెంట్ ఏంటో జనాలకు అర్థం కాదు. కొన్ని సినిమాల వరకు వాళ్ల పేర్లు కూడా జనాలకు తెలియదు. కానీ సరైన ఛాన్స్ వచ్చి తమ టాలెంట్ చూపించే అవకాశం దక్కినపుడు ఆ నటులు విజృంభించేస్తుంటారు. తమలో నిగూఢమైన ప్రతిభనంతా బయట పెట్టేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.

ఆ తర్వాత వాళ్లు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఇదే కోవకు చెందుతాడు. ‘గుంటూరు టాకీస్’, ‘కల్కి’ లాంటి సినిమాల్లో చేసినపుడు సిద్ధుకు పెద్ద గుర్తింపేమీ రాలేదు. కానీ అతణ్ని లీడ్ రోల్‌లో పెట్టి తీసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో తన టాలెంట్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అతను రచనా సహకారం కూడా అందించాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే పాత్ర.. నటన.. మాటలతో సిద్ధు మెస్మరైజ్ చేసేశాడు ఆ సినిమాలో.

ఆ తర్వాత అతణ్నుంచి వచ్చిన ‘మా వింత గాథ వినుమా’ అనుకున్న స్థాయిలో లేకపోయినా.. సిద్ధు వరకు బాగానే ఎంటర్టైన్ చేశాడు.ఇప్పటిదాకా చేసినవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు సిద్ధు నుంచి రాబోతున్న ‘డీజే టిల్లు’ మరో ఎత్తులా కనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా అంతటా దాని గురించే చర్చ. హైదరాబాద్ మాస్ పోరడిగా సిద్ధు జనాలకు తెగ నచ్చేసినట్లే ఉన్నాడు. ట్రైలర్లో అతను చెప్పిన ప్రతి డైలాగ్ వైరల్ అయిపోయింది. బిల్డప్ రాజాగా తన క్యారెక్టరైజేషన్.. యూత్‌కు పిచ్చెక్కించేసే డైలాగ్స్ మామూలుగా పాపులర్ కాలేదు.

ఈ సినిమాకు కూడా మాటలు రాసింది సిద్ధునే. హైదరాబాద్ అర్బన్, మాస్ యూత్ పల్స్‌ను అతను బాగానే పట్టేసినట్లున్నాడు. చిన్న సినిమా అయినప్పటికీ ‘డీజే టిల్లు’కు బంపర్ క్రేజ్ రావడానికి సిద్ధునే కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా టైటిల్ సాంగ్ సైతం సూపర్ హిట్టయింది. ఈ సినిమా రిలీజైపుడు సెన్సేషన్ క్రేయేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిద్ధు ఈ సినిమాతో ఇంకో రేంజికి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ వీడు మామూలోడు కాదు అని సిద్ధు గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుల చేతిలో పడితే సిద్దు ఇంకా మంచి స్థాయికి వెళ్లే ఛాన్సుందని అంటున్నారు.

This post was last modified on February 5, 2022 3:50 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

2 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

4 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

4 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

8 hours ago