బండ్ల గణేష్ ఇప్పుడు నిర్మాతే కానీ.. ఒకప్పుడు అతనో నటుడు. మరీ పెద్ద పాత్రలేమీ చేసింది లేదు కానీ.. చిన్నవే చాలా పెద్ద సంఖ్యలో చేశాడు. అతను నటించిన సినిమాలు ట్రిపుల్ డిజిట్‌లోనే ఉన్నాయి. ఐతే సుదీర్ఘ కాలం నటుడిగా సినిమాలు చేసినా.. ఎప్పుడూ తాను కోరుకున్న రెస్పెక్ట్ ఇచ్చే పాత్రలు తనకు పడలేదని.. 30 ఏళ్లలో రాని రెస్పెక్ట్ ‘డేగల బాబ్జీ’ సినిమాతో తనకు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు బండ్ల.
తమిళంలో గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్‌గానూ సక్సెస్ కావడమే కాదు.. జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ అనే సినిమాను బండ్ల గణేష్ హీరోగా తెలుగులో ‘డేగల బాబ్జీ’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో పార్తీబన్ తనే లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. దాదాపు రెండు గంటల నిడివితో ఉండే ఈ సినిమాలో ఈ ఒక్క పాత్రే ఉంటుంది.
తన మిత్రుడైన వెంకట్ చంద్ర ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ రీమేక్ హీక్కులు తీసుకున్నాక తనను కలిసి ఈ కథ చెప్పాడని.. ఎవరైనా పెద్ద హీరో ఈ సినిమా చేస్తే బాగుంటుందని తనతో అన్నానని.. కానీ ఆ పాత్ర తననే చేయమని అడగ్గానే షాకయ్యానని బండ్ల గణేష్ తెలిపాడు. పార్తీబన్ చేసిన పాత్ర.. అందులోనూ సినిమా అంతటా ఒక్కటే ఉండే పాత్రకు తనను అడగడంతో తాను చేయనంటే చేయను అనేశానని.. ఆ పాత్ర చేయడానికి తనకు చాలా భయం వేసిందని బండ్ల గణేష్ తెలిపాడు.
కానీ వెంకట్ చంద్ర పట్టు వదలకుండా తన వెంట పడి ఈ పాత్ర చేయించాడని.. చాలా భయపడుతూనే ఈ సినిమా చేసిన తాను.. చివరికి ఫస్ట్ కాపీ చూసుకుని షాకయ్యానని బండ్ల గణేష్ తెలిపాడు. కొన్ని సన్నివేశాలు చూస్తే.. ఇది చేసింది తానేనా అని ఆశ్చర్యపోయానని.. ప్రేక్షకులు సినిమా చూసినపుడు కూడా బండ్ల గణేష్‌లో ఇంత మంచి నటుడున్నాడా అనుకుంటారని గణేష్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on February 4, 2022 11:00 am
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…