సౌత్‌లో చార్మ్ తగ్గిపోయినా.. నార్త్‌లో మాత్రం నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్, అయలాన్ తప్ప ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాలీవుడ్‌వే. ఒకటీ రెండూ కాదు.. ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ‘అటాక్’ సినిమా ఒకటి.
జాన్ అబ్రహామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకుడు. జయంతీలాల్ గడ నిర్మిస్తున్నారు. రకుల్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీని ఏప్రిల్ 1న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. దాంతో పాటు మరో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఈ మూవీ రెండు పార్ట్స్‌గా వస్తోంది. ఇప్పుడు చెప్పిన డేట్‌కి మొదటి పార్ట్‌ను రిలీజ్ చేసి.. నెక్స్ట్ ఇయర్ రెండో పార్ట్‌ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో టూ పార్ట్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే నిజానికి ఇది మనకి ఇప్పుడు ఎక్కువవుతోంది కానీ ఇలా ఫ్రాంచైజీలు తీయడం బాలీవుడ్‌లో అలవాటే. ఒక్కో సినిమానీ మూడు నాలుగు పార్టులు కూడా తీస్తుంటారు వాళ్లు. మరి అటాక్ రెండు పార్ట్స్‌తో ఆగుతుందో ఇంకా ముందుకు కొనసాగుతుందో చూడాలి.
This post was last modified on February 3, 2022 9:34 pm
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…
సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి…
తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…
మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు…
రౌడీ బాయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 12 విడుదల తేదీని మే 30కి లాక్ చేసినట్టు…
ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్…