Movie News

బాయ్ ఫ్రెండ్స్‌పై తాప్సి హాట్ కామెంట్

ఫీలిం ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్లో ఎఫైర్ల జోన్లోకి వెళ్లని వాళ్లు చాలా చాలా తక్కువ. ఐతే రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మీడియా వాళ్లు అడిగినా కొట్టి పారేస్తారు. కానీ తర్వాతేమో ఆ బంధాల తాలూకు చేదు అనుభవాల గురించి మాట్లాడుతుంటారు. ఈ జాబితాలో కంగనా రనౌత్ సహా చాలామందే ఉన్నారు. ఇప్పుడు తాప్సి పన్ను సైతం ఇదే తరహాలో మాట్లాడుతోంది.

తాను ఎవరితో డేట్ చేసింది ఏంటి అన్నది చెప్పలేదు కానీ.. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ లిస్టు పెద్దదే అని అంటోంది తాప్సి. కానీ వాళ్లలో ఒక్కరు కూడా పనికొచ్చే వారు లేరని.. అందరూ వేస్టే అని తేల్చేసింది తాప్సి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేసినట్లు తాప్సి వెల్లడించింది.

మరి వాళ్లలో ఎవ్వరూ మంచి వాళ్లు తగల్లేదా.. ఎవరితోనూ బంధాన్ని ముందుకు తీసుకెళ్లలేదా అని అడిగితే.. అందరూ దొంగలే అని తేల్చేసింది. తాను డేట్ చేసిన వాళ్లలో ఎవ్వరూ కూడా సక్రమంగా తమ పని తాము చేసుకుని బతికే వాళ్లు కాదని.. ఎలా మోసం చేసి, వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిద్దామా అని చూసేవాళ్లే అని.. అందుకే ఎవరితోనూ తన బంధం నిలబడలేదని తాప్సి చెప్పింది.

కెరీర్ విషయానికి వస్తే.. సౌత్ సినిమాలలో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసిన తాప్సి.. బాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి అదరగొట్టేస్తోంది. ‘బద్లా’ సహా అనేక చిత్రాల్లో తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుని మంచి విజయాలందుకుంది. కొవిడ్ నేపథ్యంలో ఈ మధ్య తాప్సి సినిమాలు వరుసగా ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. గత ఏడాది నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన ‘హసీన్ దిల్‌రుబా’ మంచి స్పందన తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘రష్మి రాకెట్’కు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. తాజాగా ఆమె ‘లూప్ లపేటా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికీ మంచి రివ్యూలే వచ్చాయి.

This post was last modified on February 3, 2022 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

59 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago