సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఫైనల్ గా మే 12న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. అయితే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అవుతారట. మార్చి నెలకి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయి.
థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే చాలా మందికి అమ్మేశారు. తాజాగా సినిమా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లించి ‘సర్కారు వారి పాట’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ పూర్తయి అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ థియేటర్లో విడుదలైన 30 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్లు ఒప్పందం చేసుకున్నారట.
అంటే మేలో సినిమా విడుదలైతే.. జూన్ నాటికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.
ఇప్పుడు ఏ సినిమా లైఫ్ స్పాన్ అయినా.. రెండు, మూడు వారాలే. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తో సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. డిజిటల్ రైట్స్ కి కోట్లు పలుకుతున్నాయి. కానీ తమ అభిమాన హీరో సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం అభిమానులకు రుచించడం లేదు..
This post was last modified on February 2, 2022 5:26 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…