బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ.. సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి అనే క్యారెక్టర్ లో కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ లో అనసూయ చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2లో నటించబోతుంది. ఇదిలా ఉండగా.. రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఆమె చంద్రకళ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తుందట.
అయితే ఈ పాత్రకు సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. ఇందులో అనసూయ డ్యూయల్ రోల్ పోషిస్తుందని.. ఒక క్యారెక్టర్ చనిపోతుందని.. మిగిలిన క్యారెక్టర్ సినిమా మొత్తం కనిపిస్తుందని.. వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషించడం లేదట.
‘రంగమ్మత్త’ సినిమాలో మాదిరి ‘ఖిలాడి’లో అనసూయ అత్తగా కనిపించనుందట. అయితే ఇందులో ఆమె రోల్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా.. రవితేజకి అత్తగా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది. అత్తగానే కనిపిస్తుంది తప్ప సినిమాలో అనసూయకి మరో రోల్ లేదని సమాచారం.
ఈ నెలలలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి మంచి రేటు పలికింది. రిలీజ్ కు ముందే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే డైరెక్టర్ కి గిఫ్ట్ గా ఓ కారు కూడా ఇచ్చారు.
This post was last modified on February 2, 2022 3:46 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…