టాలీవుడ్లో మరోసారి రిలీజ్ డేట్ల జాతర నడుస్తోంది. నిన్నట్నుంచి వరుసబెట్టి కొత్త సినిమాలకు డేట్లు ప్రకటిస్తున్నారు. ఇలా డేట్లు ప్రకటించడం.. తర్వాత మళ్లీ మార్చడం రెండేళ్లుగా నడుస్తున్న కథే కావడంతో జనాలు మరీ సీరియస్‌గా ఏమీ తీసుకోవట్లేదు. కొవిడ్ పుణ్యమా అని పరిస్థితులు అలా తయారయ్యాయి మరి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఒక సినిమాను రెండు డేట్లు ప్రకటించి ఇది కాకుంటే అది అనే కొత్త సంప్రదాయం ఇప్పుడే కనిపిస్తోంది. ఆచార్య, భీమ్లా నాయక్, గని సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విషయంలోనే ఇలాగే చేశారు. ముందు ఈ సినిమాకు మార్చి 25న రిలీజ్ ఖాయం చేశారు.
కానీ ఇప్పుడు ఆ తేదీకి ఆర్ఆర్ఆర్ ఖరారవడంతో సమస్య వచ్చి పడింది. డేట్ మార్చుకోక తప్పలేదు. కొత్తగా ఏప్రిల్ 14కు డేట్ ఎంచుకున్నారు. అలాగని మార్చి 25 మీద ఆశలు వదులుకోలేదు. ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందేమో అన్న ఆశతో కావచ్చు. కుదిరితే మార్చి 25న లేదంటే ఏప్రిల్ 14న అంటూ ప్రకటన విడుదల చేశారు. కానీ మార్చి 25న ఆర్ఆర్ఆర్ కచ్చితంగా రిలీజవుతుందనే అంచనా వేస్తున్నారు. ఆ చిత్ర బృందం కూడా ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉంది.
కాబట్టి రామారావు చిత్రానికి ఆ తేదీలో ఛాన్స్ లేనట్లే. అలాగని ఏప్రిల్ 14న కూడా ఈ సినిమా పక్కా ఏమీ కాదు. ఎందుకంటే అదే రోజుకు కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రం షెడ్యూల్ అయి ఉంది. ఆ సినిమాను ఆ తేదీకి ఎప్పుడో ఖాయం చేశారు. ఇప్పుడు మరోసారి చిత్ర బృందం ఏప్రిల్ 14 రిలీజ్ కన్ఫమ్ చేసింది. కేజీఎఫ్-2 మీద తెలుగులో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాక అవతల కూడా రామారావు సినిమాకు చాలా కష్టమవుతుంది. పోటీ తట్టుకోవడం ఈజీ కాదు. కాబట్టి ఆ తేదీన కూడా రామారావు రావడం కష్టమే. అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా అయింది పరిస్థితి. కాబట్టి కొత్తగా ఇంకో డేట్ చూసుకోక తప్పదు.
This post was last modified on February 2, 2022 11:19 am
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…