తన సమకాలీన కథానాయికను ఇంకో కథానాయిక పొగడ్డం తక్కువగానే జరుగుతుంటుంది. ఐతే ప్రియమణి మాత్రం అలాంటి భేషజాలేమీ పెట్టుకోకుండా సమంత మీద ప్రశంసల జల్లు కురిపించింది. ఆమె చేసే పాత్రలను ప్రశంసిస్తూనే.. ఇటీవల సమంత ఒక ఊపు ఊపేసిన ఉ అంటావా పాట విషయంలోనూ తనను కొనియాడింది. ఈ పాట చేసినందుకు సమంతకు ప్రియమణి థ్యాంక్స్ చెప్పడం విశేషం.
సమంత ఎప్పుడో మూస పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందని.. వైవిధ్యమైన, రకరకాల పాత్రల్లోనూ నటిస్తోందని ప్రియమణి ప్రశంసించింది. ఇక సమంత చేసిన ఉ అంటావా పాటను దేశవ్యాప్తంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారని, ఈ పాటలో ఆమె చాలా హాట్‌గా కనిపించిందని ప్రియమణి అంది. తన భర్త సైతం సమంత ఈ పాటలో చాలా హాట్‌గా ఉందని వ్యాఖ్యానించినట్లు ప్రియమణి వెల్లడించింది. ఈ పాట చేసినందుకు అందరూ సమంతకు థ్యాంక్స్ చెప్పాలని ప్రియమణి అంది.
ఆహా కోసం తాను చేసిన భామా కలాపం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి ఈ విషయాలు మాట్లాడింది. హీరోయిన్ల విషయంలో ఇటు ఫిలిం మేకర్స్, అటు ప్రేక్షకుల దృష్టికోణం మారడం మంచి పరిణామమని ప్రియమణి అభిప్రాయపడింది.
హీరోయిన్ల కోసం ఇంతకుముందు ఇంతకుముందు గ్లామర్ ఓరియెంటెడ్ రోల్సే తీర్చిదిద్దేవారని.. కానీ ఈ మధ్య కమర్షియల్ సినిమాల్లో సైతం హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కుతున్నాయని ప్రియమణి అంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా గతంతో పోలిస్తే చాలా పెరిగాయని చెప్పింది. నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. నేత్రికన్ తరహా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తోందని.. హీరోయిన్లకు ఇలాంటి ప్రాధాన్యం దక్కడం శుభపరిణామమని ప్రియమణి వ్యాఖ్యానించింది.
This post was last modified on February 2, 2022 9:47 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…