Movie News

లైగ‌ర్ న‌ష్టం.. దాంతో పూడ్చేయ‌బోతున్నారా?

టాలీవుడ్లో సూప‌ర్ ఫాస్ట్‌గా సినిమాలు తీసే ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌రు. త‌న స్థాయి స్టార్ డైరెక్ట‌ర్లు చాలామంది స్క్రిప్టు త‌యారీకి, సినిమాకు క‌లిపి క‌నీసం ఏడాది స‌మ‌యం తీసుకునేవారే. కానీ పూరి అలా కాదు. కొన్ని వారాల్లో స్క్రిప్టు రాసేసి.. మూణ్నాలుగు నెల‌ల్లో సినిమాలు అవ‌గొట్టేస్తుంటాడు. ఆయ‌న కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పోకిరికి సైతం ఇదే స్పీడ్ చూపించాడు పూరి. అందుకే ప్ర‌స్తుత స్టార్ డైరెక్ట‌ర్లంద‌రి కంటే చాలా ఎక్కువ సినిమాలు చేయ‌గ‌లిగాడు.

ఫాంలో ఉన్నా, లేకున్నా పూరిది అదే స్పీడు. సినిమాల మేకింగ్ విష‌యంలో నాన్చుడు ధోర‌ణి ఎప్పుడూ లేదు పూరి విష‌యంలో. కానీ క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆయ‌న కొత్త సినిమా లైగ‌ర్ మాత్రం చాలా ఆల‌స్యం అయింది. ఈ సినిమా మొద‌లై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఇంకా కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌ట్లేదు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

లైగ‌ర్ షూట్ అవ‌గొట్టేశాక హిందీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌ల‌ను నిర్మాత‌ల్లో ఒక‌రైన క‌ర‌ణ్ జోహార్‌కు అప్ప‌గించేసి.. వేరే సినిమా మొద‌లుపెట్టేయ‌బోతున్నాడు పూరి. అదే.. జ‌న‌గ‌ణ‌మ‌న‌. లైగ‌ర్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే ఇందులో హీరో కాగా అత‌డి స‌ర‌స‌న బాలీవుడ్ భామ జాన్వి క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో మొద‌లు కాబోతోంద‌ట‌. ఫిబ్ర‌వ‌రిలోనే షూటింగ్ ఆరంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

లైగ‌ర్ రిలీజ‌య్యే లోపే ఈ సినిమా షూటింగ్ అవ‌గొట్టేసేలా ప‌క్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడ‌ట పూరి. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే.. మ‌రోవైపు లైగ‌ర్ తెలుగు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూడ‌బోతున్నాడ‌ట ఆయ‌న‌. లైగ‌ర్ బాగా లేట‌వ‌డం వ‌ల్ల పూరికి, విజ‌య్‌కి జ‌రిగిన న‌ష్టాన్ని జ‌న‌గ‌ణ‌మ‌న‌తో పూడ్చేయ‌డానికే వేగంగా ఈ సినిమాను లాగించేయాల‌ని చూస్తున్నారు. ఈ సినిమాకు స్క్రిప్టు కొన్నేళ్ల ముందే పూర్త‌వ‌డం విశేషం. మ‌హేష్ బాబు కోసం త‌యారు చేసిన ఆ క‌థ‌ను ఇప్పుడు విజ‌య్‌తో తీయ‌బోతున్నాడు పూరి.

This post was last modified on February 2, 2022 9:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

2 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

7 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

11 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

12 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

13 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

14 hours ago