Movie News

ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్.. కొత్త సిరీస్

రాజ్-డీకే.. మన తెలుగు వాళ్లు. ఐతే ఈ దర్శక ద్వయం జెండా ఎగరేసింది బాలీవుడ్లో. ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో వీళ్లిద్దరూ తమ సత్తాను చాటారు. ఐతే అరడజనుకు పైగా సినిమాలు తీస్తే వచ్చిన పేరు కంటే కూడా ఒక్క వెబ్ సిరీస్‌తో వీళ్లకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఆ సిరీస్.. ఫ్యామిలీ మ్యాన్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ వెబ్ సిరీస్‌ల చరిత్రలో ‘ఫ్యామిలీ మ్యాన్’ది ప్రత్యేక స్థానం.

ఇండియాలో ప్రేక్షకులు వెబ్ సిరీస్‌లకు బాగా అలవాటు పడేలా చేయడంలో రాజ్-డీకేల ఈ సిరీస్‌ది కీలక పాత్ర. అమేజాన్ ప్రైమ్‌కు భారీగా సబ్‌స్క్రైబర్లను తెచ్చి పెట్టి దాని ఆదరణ పెంచడంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి కాగా.. ఇంకో దానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అది పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది. ఈ లోపు రాజ్-డీకే ఇంకో సిరీస్‌ను లైన్లో పెట్టారు. వరుసగా అమేజాన్ ప్రైమ్‌కే ఒరిజినల్స్ చేస్తున్న రాజ్-డీకేలకు స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్లో నిర్మించబోయే ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్‌కు రాజ్-డీకే దర్శకత్వం వహించబోతున్నారు. ఇది ఫన్నీగా సాగే గ్యాంగ్ స్టార్ థ్రిల్లర్ అట. రాజ్-డీకే థ్రిల్లర్ సినిమా తీసినా.. డ్రామా కథాంశం ఎంచుకున్నా ఎంటర్టైన్మెంట్‌కు పెద్ద పీట వేస్తారు. కథలో సీరియస్‌నెస్‌ ఉంటూనే కథనం సరదాగా సాగుతుంది. వాళ్లిద్దరి సెన్సాఫ్ హ్యూమరే వేరు.

‘ఫ్యామిలీ మ్యాన్’ రెండు సీజన్లలోనూ లీడ్ రోల్ చేసిన వినోద్ బాజ్‌పేయి పాత్ర, అతడి పక్కనుండే స్నేహితుడి క్యారెక్టర్ ఎంతగా ఎంటర్టైన్ చేశాయో తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ చేయబోతున్న ‘గన్స్ అండ్ గులాబ్స్’ మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇందులో ప్రధాన తారాగణం గురించి వివరాలు వెల్లడి కాలేదు. కానీ షూటింగ్ మాత్రం మొదలైపోయింది. ఇది పూర్తి కాగానే ప్రైమ్ కోసం ఇంకో వెబ్ సిరీస్ చేసి.. ఆ తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని పట్టాలెక్కించనున్నారు రాజ్-డీకే.

This post was last modified on February 1, 2022 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago