ఒక సినిమా థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతుందా ఆసక్తి చూసేవాళ్లు ఒక వర్గం అయితే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఏ చిత్రం ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసేవాళ్లు ఇంకో వర్గం తయారయ్యారు. కొన్నేళ్ల నుంచి డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాలకు కొత్త మార్కెట్ ఏర్పడి మంచి ఆదాయమే వస్తోంది. ఆ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది కూడా. ఓటీటీల హవా రోజు రోజుకూ పెరుగుతూ.. ప్రేక్షకులు వాటికి బాగానే అలవాటు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు మన ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరిచే తమిళ, హిందీ చిత్రాల్లో ఏది ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందో ఒకసారి చూద్దాం.ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ డీల్ ఎప్పుడో పూర్తయింది. ఆ చిత్రం హిందీ వరకు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు జీ-5లో విడుదలవుతాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలన్నరకు ఈ చిత్రం ఓటీటీల్లో వస్తుందని సమాచారం.
తెలుగులో రిలీజ్ కాబోతున్న ఇంకో రెండు క్రేజీ సినిమాలు ఆచార్య, సర్కారు వారి పాట చిత్రాలకు అమేజాన్ ప్రైమ్‌తో డీల్ ఓకే అయింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఇవి ఓటీటీ బాట పట్టబోతున్నాయి. అమేజాన్ ప్రైమ్‌లో వేరే భాషలకు సంబంధించి కొన్ని హిందీ చిత్రాలు కూడా రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత అమితాసక్తిని రేకెత్తిస్తున్న ‘కేజీఎఫ్-2’ సైతం రిలీజైన నెలన్నరకు ప్రైమ్‌లో వస్తుంది.
అలాగే హిందీ సినిమాలు జయేష్బా జోర్దార్, షంషేరా, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, హీరోపంటి-2 కూడా అమేజాన్ ప్రైమ్‌లోనే రాబోతున్నాయి. ఇక జీ ఓటీటీ మరికొన్ని ఆసక్తికర చిత్రాలను రిలీజ్ చేయబోతోంది. అజిత్ భారీ చిత్రం వలిమై, విశాల్ మూవీ సామాన్యుడు కూడా అందులోనే రిలీజవుతాయి. ఇక తమిళంలో సూర్య సినిమా ఈటీ, విజయ్ మూవీ బీస్ట్, శివ కార్తికేయన్ చిత్రం డాన్‌లకు నెట్ ఫ్లిక్స్‌తో డీల్ ఓకే అయింది. హిందీలో ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా, షాహిద్ చిత్రం జెర్సీ కూడా నెట్ ఫ్లిక్స్‌లోనే వస్తాయి.
This post was last modified on February 1, 2022 4:15 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…