Movie News

స‌ల్మాన్ సింగిలా కాదా?

90వ ద‌శ‌కంలో మై నే ప్యార్ కియా, హ‌మ్ ఆప్కే హై కౌన్ స‌హా కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలందుకుని అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయాడు స‌ల్మాన్ ఖాన్. అప్ప‌ట్నుంచి బాలీవుడ్లో మోస్ట్ ఎలిబిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ఒక‌డిగా ఉంటున్నాడు. పాతికేళ్ల వ‌య‌సుతో మొద‌లుపెట్టి 56 ఏళ్ల వ‌ర‌కు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల లిస్టులో ఉండ‌టం స‌ల్మాన్‌కే చెల్లింది. అతడి ప్రేమాయ‌ణాల గురించి, పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.

కానీ అధికారికంగా ఏ అమ్మాయితోనూ ఇప్ప‌టిదాకా బంధం మొద‌లుపెట్ట‌లేదు స‌ల్మాన్. ఒక‌ప్పుడు ఐశ్వ‌ర్యారాయ్.. ఆ త‌ర్వాత క‌త్రినా కైఫ్‌ల‌తో అత‌ను కొంత కాలం రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడు. చివ‌ర‌గా రొమేనియా అమ్మాయి లులియా వాంటూర్‌తో అత‌డి ప్రేమాయ‌ణం గురించి వార్త‌లొచ్చాయి. వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ స‌ల్మాన్ మాత్రం ఎంత‌కీ వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌లేదు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఫినాలె సంద‌ర్భంగా స‌ల్మాన్ పెళ్లి, రిలేష‌న్‌షిప్ లాంటి అంశాల‌పై మాట్లాడాడు. ఇటీవ‌లే విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లాడిన‌ త‌న మాజీ ప్రేయ‌సి క‌త్రినాకు శుభాకాంక్ష‌లు చెప్పిన స‌ల్మాన్.. త‌న రిలేష‌న్ షిప్ స్టేట‌స్ గురించి అడిగిన‌పుడు.. తాను సింగిల్‌గా ఉన్న‌పుడే చాలా సంతోషంగా ఉంటాన‌ని పేర్కొన్నాడు.

ఇంత‌కీ మీరిప్పుడు సింగిలా కాదా అంటే మాత్రం స‌మాధానం చెప్ప‌లేదు. సింగిల్‌గా ఉన్న‌పుడే హ్యాపీ అనే విష‌యాన్ని కొంచెం వెట‌కారంగా చెప్ప‌డంతో ఇప్పుడు అత‌ను రిలేష‌న్‌షిప్‌లో ఉన్నందుకే ఈ మాట అంటున్నాడ‌ని.. లులియాతో కూడా అత‌డి బంధం ముందుకు సాగ‌దేమో అని.. ఎప్ప‌టికీ స‌ల్మాన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటాడేమో అని అభిమానులు సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

This post was last modified on February 1, 2022 11:38 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago