Movie News

త్రివిక్రమ్ సినిమాలతో సమస్య అదే..

రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యే పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. పూరి జగన్నాథ్ ఒకప్పటి స్థాయిలో ఫాంలో లేకపోయినా సరే.. ‘లైగర్’ సినిమాతో ఆయన కూడా పాన్ ఇండియా లీగ్‌లోకి చేరుతున్నాడు. ఐతే టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ మాత్రమే పాన్ ఇండియా ఆలోచనలేవీ చేయట్లేదు.

ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ తెలుగు వాళ్లను మాత్రమే అలరించాయి. డబ్ చేసినా, రీమేక్ చేసినా కూడా త్రివిక్రమ్ చిత్రాలు వేరే భాషల్లో అంతగా ఆడిన దాఖలాలు లేవు. ఐతే వేరే స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న నేపథ్యంలో మాటల మాంత్రికుడు అభిమానులు కొంచెం ఫీలవుతున్నారు. తమ అభిమాన దర్శకుడు కూడా పాన్ ఇండియా సినిమాలతో తనేంటో రుజువు చేయాలని కోరుకుంటున్నారు.

కానీ వేరే దర్శకులు ఆలోచనలు వేరు. వాళ్ల సినిమాలు వేరు. వాళ్లతో పోలిస్తే త్రివిక్రమ్ చేసేవి అచ్చ తెలుగు సినిమాలని చెప్పొచ్చు. త్రివిక్రమ్ సినిమాల మ్యాజిక్ అంతా కూడా ఆయన మాటల్లోనే ఉంటుంది. మాటలతో ఆయన చేసిన గారడీకి మన వాళ్లు ఫిదా అయిపోతుంటారు. ఎంటర్టైన్మెంట్లోనూ తెలుగుదనం ఉంటుంది. వేరే ఆకర్షణలు ఎన్ని ఉన్నా కూడా.. వినోదం, ఎమోషన్లు పండేది కేవలం త్రివిక్రమ్ మాటల వల్లే. కథల పరంగా చూస్తే త్రివిక్రమ్ చిత్రాల్లో అంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. చాలా సాధారణంగా అనిపిస్తాయి ఆయన కథలు.

త్రివిక్రమ్ మార్కు సెన్సాఫ్ హ్యూమర్, ఎమోషనల్ టచ్‌తో సన్నివేశాలు మన వాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేసినపుడు అవి సాధారణంగా అనిపించడానికి నేటివిటీ ఫ్యాక్టర్ మిస్ అవుతుండటం, మాటల్లో చాతుర్యం కనిపించకపోవడమే కారణం. త్రివిక్రమ్ లాగా వాళ్లు వినోదాన్ని పండించలేక పోవడం మైనస్ అవుతోంది. మన వాళ్ల మాదిరి త్రివిక్రమ్ సినిమాలతో వేరే వాళ్లు కనెక్ట్ కావట్లేదు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడం కాస్త కష్టమే అనిపిస్తోంది.

This post was last modified on February 1, 2022 10:12 am

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

10 minutes ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

2 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

3 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

3 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

4 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

6 hours ago