మొత్తానికి మళ్లీ టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర మొదలైంది. కరోనా మూడో వేవ్ ప్రభావం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో వేసవి సినిమాలకు ఇబ్బంది లేదని ఫిక్సయి.. వరుసగా ఒక్కో భారీ చిత్రానికి రిలీజ్ డేట్లు ప్రకటించడం మొదలైంది. ఆర్ఆర్ఆర్‌ను మార్చి 25కు ఖరారు చేయగా.. సర్కారు వారి పాట మే 12కు ఖాయమైంది. భీమ్లా నాయక్‌ను వీలైతే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామంటున్నారు.
మరోవైపు ఏప్రిల్ 1కి అనుకున్న ఆచార్య సినిమాను ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తున్న నేపథ్యంలో ఈ మార్పు అని వెల్లడించారు. ఇక్కడిదాకా లైనప్ అంతా బాగానే ఉంది. మంచి అండర్‌స్టాండింగ్‌తోనే డేట్లు సర్దుబాటు చేసుకున్నట్లుగా అనిపించింది.
కానీ ఇంతలో ఎఫ్-3 సినిమా లైన్లోకి వచ్చింది. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 29న ఆచార్య ఉండగా.. ముందు రోజు మరో పెద్ద సినిమాను ఎలా రిలీజ్ చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఇది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రకటించిన రిలీజ్ డేట్ లాగా లేదు. ఎక్కడో మిస్ అండర్ స్టాండింగ్, కమ్యూనికేషన్ జరిగినట్లుగా అనిపిస్తోంది. ఆచార్య సినిమాను నైజాం ఏరియాలో దిల్ రాజు ప్రధాన ప్రత్యర్థిగా మారిన వరంగల్ శీను రిలీజ్ చేస్తున్నాడు.
అందుకే రాజు పట్టుదలకు పోయి కావాలనే ఎఫ్-3 సినిమాను ఒక రోజు ముందు షెడ్యూల్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా వ్యవహరిస్తూ, రిలీజ్ డేట్ల విషయంలో కూడా అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్న దిల్ రాజు.. ఆల్రెడీ ఆచార్యకు ఏప్రిల్ 29 రిలీజ్ డేట్ ఖరారయ్యాక ఇలా తన సినిమాను పోటీకి దింపడమేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి రాజు ఆలోచనేంటో మరి. ఆ సినిమా డేట్ మారొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on February 1, 2022 9:31 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…